టాటా నానో కారు పునరాగమనానికి రంగం సిద్ధం ?

Telugu Lo Computer
0


దేశంలోని మధ్య తరగతి ప్రజల కలల కారు టాటా నానో మళ్లీ ఒకసారి కొత్త రూపంలో భారత్ రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. 2008లో టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ప్రవేశపెట్టిన ఈ చిన్న కారును "రూ.లక్ష కారు"గా గుర్తించారు. ఇప్పుడు 2025లో నానో మళ్లీ పునరాగమనానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈసారి అది కేవలం చవకైన కారు మాత్రమే కాదు, అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన లుక్‌తో కూడిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మారుతోంది. కొత్త టాటా నానో ఎంతో స్టైలిష్‌గా, ఆధునిక రూపంలో వచ్చేస్తోంది. హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేఅర్లైట్స్, బోల్డ్ అల్లాయ్ వీల్స్, కొత్త కలర్ ఆప్షన్లు ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చాయి. కేవలం 3.1 మీటర్ల పొడవు, 180 మి.మీ.ల గ్రౌండ్ క్లియరెన్స్తో భారత నగరాల్లో రద్దీ ట్రాఫిక్, చిన్న పార్కింగ్ స్థలాల్లో ఇది సౌకర్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త నానోలో 624 సీసీ ట్విన్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉండబోతోంది. ఇది 38PS పవర్, 51Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆటోమెటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. లీటరుకు 40 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదనే అంచనాలు ఉన్నాయి. కంపెనీ భవిష్యత్తులో టర్బో పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వెర్షన్ లను కూడా తీసుకురావాలని యోచిస్తోంది. ఈవీ మోడల్ సింగిల్ చార్జ్‌పై సుమారు 250 కి.మీ వరకు రేంజ్ ఇవ్వగలదట. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో, ఈ మైలేజ్ నిజంగా బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలుస్తుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్, యూఎస్‌బీ, ఎయూఎక్స్ సపోర్ట్ , పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, సన్‌రూఫ్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు ఈ ఫీచర్లు చిన్న కారులో కూడా ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)