'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' అర్హుల జాబితా విడుదల

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం' కింద లబ్దిదారులైన 47.77 లక్షల అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్. డిల్లీరావు నేడు వివరాలు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా సంవత్సరానికి రూ.20,000 (పీఎం కిసాన్ రూ.6,000, రాష్ట్రం నుంచి రూ.14,000) మూడు విడతలలో ఈ నిధులను అందించనుంది. స్వంత భూమి, డి-పట్టా, ఇనామ్, అసైన్డ్ ల్యాండ్స్, అడవి భూములు సాగు చేసే రైతులు, భూమిలేని కౌలు రైతులు ఈ పథకానికి అర్హులు. వెబ్‌ల్యాండ్, గిరిభూమి పోర్టల్స్ ద్వారా డేటా సేకరించి, 98% రైతులు e-KYC పూర్తి చేశారు. జులై రెండవ వారంలో రూ.7,000 (పీఎం కిసాన్ రూ.2,000, అన్నదాత రూ.5,000) జమ కానుంది. ఆగస్ట్‌లో మరో విడత విడుదలవుతుంది. అర్హుల జాబితాను annadathasukhibhava.ap.gov.inలో చెక్ చేసుకోవాలని డిల్లీరావు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)