తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా శ్రావణ భార్గవి ఎంతో గుర్తింపు పొందిన ఈమె తన తోటి సింగర్ అయినటువంటి హేమచంద్రని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక అమ్మాయి కూడా పుట్టింది. కొన్ని సంవత్సరాలపాటు వీరి సంసారం బాగానే సాగిన ఆ తర్వాత ఏమైందో ఏమో ఇద్దరి గురించి విడాకుల వార్తలు ప్రతి రోజు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రావణ భార్గవి చేసిన పోస్ట్ చూస్తే వీరు డైవర్స్ తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే శ్రావణ భార్గవి పోస్ట్ చేసింది ఏంటయ్యా అంటే.. జీవితం చాలా సున్నితమైనది. అవసరాలు చిక్కుముళ్ళు అపార్ధాలు, వివాదాలు గొడవలు.. వీటితో బతికేయడంలో అర్థం లేదన్నారు. ఇందులో ప్రేమ మాత్రమే అర్థవంతమైనది. మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ప్రేమించడానికి చూడాలి.. జీవితంలో మనం గెలిచామో? ఓడామో అదే డిసైడ్ చేస్తుందని శ్రావణ భార్గవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నేటిజన్స్ ఈమె హేమచంద్రని ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంటే ఈమె విడాకులు తీసుకోవడానికి సంసిద్ధం అయ్యాను అంటూ హింట్ ఇచ్చిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు
వివాదాలు గొడవలతో బతికేయడంలో అర్థం లేదు : శ్రావణ భార్గవి
July 03, 2025
0
Tags