మహిళలకు రుతుక్రమం ఆగిపోతే బరువు బాగా పెరిగిపోతుంటారు. శారీరక, మానసిక శ్రమ పడినా కూడా బరువు పెరిగిపోతూ ఉంటారు. అయితే ఇలా అధిక బరువుతో ఉన్న మహిళలకు రొమ్ముక్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న మహిళలు, రుతుక్రమ ఆగిపోయిన తర్వాత అధిక బరువుతో బాధపడుతున్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ సమస్యలతో ఉన్నవారిలో దాదాపు 31 శాతం మందికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. బరువు ఎక్కువ ఉన్నవారిలో అదేవిధంగా శారీరక శ్రమ లేని వారిలో ఈ మధ్యకాలంలో క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి లక్ష మంది మహిళల్లో సాధారణంగా వచ్చే సంఖ్యతో పోల్చితే అదనంగా 153 రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. అంతేకాదు గుండె జబ్బులో ఉన్నవారిలో 32 శాతం రొమ్ము క్యాన్సర్లు పెరుగుతుంటే, గుండె జబ్బులు లేనివారిలో ఈ ప్రమాదం 13 శాతం వరకు ఉంది. అదేవిధంగా బరువు ఎక్కువగా ఉండటం, టైప్ 2 షుగర్ ఉన్నా లేకపోయినా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఒకే రకంగా ఉండటం ఇప్పుడు అందరినీ కలవర పెడుతోంది.
అధిక బరువుతో మహిళలకు రొమ్ము క్యాన్సర్ !
July 25, 2025
0
Tags