అమెరికాలోని వాషింగ్టన్ లొ జరిగిన ఏఐ సమ్మిట్ కు హాజరైన పలు అమెరికా టెక్ కంపెనీలను ఉద్దేశిస్తూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ చైనాలో తమ పరిశ్రమలను నిర్మించడం, అక్కడ భారత్ కు చెందిన కార్మికులను నియమించుకోవడం ద్వారా సదరు అమెరికా కంపెనీలు అమెరికన్ల విశ్వాసాన్ని కోల్పోయాయని అన్నారు. తన హయాంలో ఇక ఆ రోజులు ముగిసిపోయినట్టేనని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో గెలవడానికి దేశభక్తి కావాలన్నారు. ఏఐ రంగంలో అమెరికాను మొదటి స్థానంలో ఉంచాలని టెక్ కంపెనీలను ట్రంప్ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో విజయం సాధించడానికి సిలికాన్ వ్యాలీ లోపల, వెలుపల కొత్త దేశభక్తి, జాతీయ విధేయత అవసరమని ట్రంప్ సూచించారు. అమెరికా టెక్ పరిశ్రమ చాలా కాలం వరకు రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించిందని ఇది మిలియన్ల మంది అమెరికన్లకు అపనమ్మకాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ యాక్షన్ ప్లాన్ సహా కృత్రిమ మేధకు సంబంధించిన మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ అమెరికా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లూప్రింట్ ను విడుదల చేశారు. కీలక సాంకేతిక పరిజ్ఞానంలో చైనాపై అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నంలో పర్యావరణ నిబంధనలను సడలించడం, మిత్రదేశాలకు కృత్రిమ మేధ ఎగుమతులను విస్తరించడం లక్ష్యంగా ఈ కొత్త కృత్రిమ మేధ(ఏఐ) బ్లూప్రింట్ ను ట్రంప్ విడుదల చేశారు. 21వ శతాబ్దాన్ని ఏఐ నిర్వచించే పోరాటంగా అభివర్ణించిన ట్రంప్, చైనాతో సాంకేతిక ఆయుధ పోటీని వివరిస్తూ ఈ ప్రణాళికను విడుదల చేశారు.
భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోకండి: అమెరికా టెక్ కంపెనీలను కోరిన డోనాల్డ్ ట్రంప్
July 24, 2025
0
Tags