భారాస ఉనికి కోసమే బనకచర్ల అంశం తెరపైకి తెచ్చింది : పయ్యావుల కేశవ్‌

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ మీడియాతో మాట్లాడుతూ బనకచర్ల అంశాన్ని ఉనికి కోసమే భారాస తెరపైకి తీసుకొచ్చిందని అన్నారు. రాయలసీమకు గోదావరి నీళ్లు రావాలని గతంలో కేసీఆర్‌ అనలేదా అని ప్రశ్నించారు. ''భారాసలో నెలకొన్న అంతర్గత వివాదంలో ఆ పార్టీ నేత హరీశ్‌రావు తన ఉనికిని కాపాడుకునేందుకు బనకచర్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. మిగతావాళ్లు ఆయన ట్రాప్‌లో పడి మాట్లాడుతున్నారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఈ అంశంపై ఎక్కడా మాట్లాడటం లేదు. ఇదంతా రాజకీయ డ్రామా. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకి ఏ విధమైన నష్టమూ జరగదు. కిందికి పోయే నీటిని వాడుకుంటే పైరాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు'' అని పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)