టాలీవుడ్ దర్శకుడు ఎస్ రాంబాబు మృతి

Telugu Lo Computer
0

టాలీవుడ్ దర్శకుడు ఎస్ రాంబాబు (నగేష్) నిన్న అర్ధరాత్రి సమయంలో మరణించినట్టు తెలుస్తోంది. దర్శకుడు ఎస్ రాంబాబు ప్రస్తుతం “బ్రహ్మాండ” అనే సినిమాకు దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కావడంతో ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ వర్షన్ చూస్తున్నారు. ఇలా చిత్ర బృందంతో కలిసి సినిమా చూస్తున్న దర్శకుడు రాంబాబు ఇంటర్వెల్ టైంలో వాష్ రూమ్ వెళ్లి అక్కడే పడిపోయారు. అయితే ఈ విషయాన్ని ఎవరు గుర్తించకపోవడం గమనార్హం. సినిమా పూర్తి అయినప్పటికీ ఈయన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి డైరెక్టర్ కోసం వెతకగా బాత్రూంలో పడి ఉన్న ఈయనని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డైరెక్టర్ ఎస్ రాంబాబు నిన్న అర్ధరాత్రి 12 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. ఆయన మృతికి బ్రహ్మాండ సినిమా చిత్ర బృందం నివాళులు అర్పించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించారు. ఇంతలోపు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాని చూస్తూ మరణించడం అనేది అందరిని ఎంతో ఆందోళనకు గురిచేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)