మూడు రోజులకు మించి విద్యార్థులు స్కూలుకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ : విద్యాశాఖ ఆదేశాలు జారీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులకు మించి విద్యార్థులు స్కూలుకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల కంటే ఎక్కువ రోజులు బడికి డుమ్మా కొడితే ఎంఈవో, సీఆర్‌పీలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. విద్యార్థి రాకపోవడానికి కారణాల తెలుసుకోవాలని పేర్కొంది. విద్యార్థులు, టీచర్ల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. టీచర్లు సెలవుపెడితే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)