జూన్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 22 శాతం పెరిగి 89,540 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ ఈ రోజు తెలిపింది. గతేడాది జూన్ నెలలో వాహన అమ్మకాలు 73,141 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయ అమ్మకాలు 16% పెరిగాయి, ఎగుమతులు గణనీయంగా 79% వృద్ధిని నమోదు చేశాయి. దేశీయంగా గత నెలలో 76,957 వాహన అమ్మకాలు నమోదవ్వగా, గతేడాది జూన్ నెలలో అమ్మకాలు 66,117 యూనిట్లని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో ఎగుమతులు 79 శాతం పెరిగి 12,583 యూనిట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం జూన్ నెలలో ఎగుమతులు 7,024 యూనిట్లు మాత్రమే. ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లు భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక కీలక మార్కెట్లలో అమ్మకాలలోను, నాణ్యతలోను మంచి పనితీరును ప్రదర్శించాయని సంస్థ సీఈఓ బి.గోవిందరాజన్ తెలిపారు.
పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు
July 01, 2025
0
Tags