విజయవాడ నగరంలో పబ్స్ వేదికగా అక్కడకు వచ్చే వారిని టార్గెట్ చేసుకుని అను అనే యువతి పెళ్లిళ్ల మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గత నెల 9వ తేదీన దుర్గ గుడిలో ఒకరిని, అదే నెల 27వ తేదీన అన్నవరంలో మరొకరిని వివాహం చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, గతంలో ఒక పబ్ లో పరిచయమైన యువతి బ్రాస్ లెట్ చోరీ చేయటంతో ఆ బాధితురాలు సీపీకి ఫిర్యాదు చేసినట్టు గుర్తించారు. అయితే, సదరు నిత్య పెళ్లి కూతురు ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాలాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అను తనను మోసం చేసినట్టు ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో దిమ్మ తిరిగే నిజాలు బయటకు వచ్చాయి. దీంతో నిత్య పెళ్లి కూతురు అను బాధితులు ఇంకా ఎంత మంది ఉన్నారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడలో పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న యువతి
July 15, 2025
0
Tags