ఆరు నెలల్లో విజయవాడ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం !

Telugu Lo Computer
0


విజయవాడ డ్రైనేజీ సమస్యకు రాబోయే ఆరు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని కాలువలను సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.500 కోట్లతో ప్రారంభించిన పనులను వైకాపా ప్రభుత్వం అర్థాంతరంగా నిలిపివేసిందన్నారు. 55శాతం పనులు తెదేపా హయాంలోనే పూర్తి చేసినట్లు చెప్పారు. మిగతా పనులు ఆరు నెలల్లో పూర్తి చేసి నగర ప్రజలకు డ్రైనేజీ సమస్య నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. ఆక్రమణలు తొలగించి పేదలకు వేరే చోట ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)