హీరో రవితేజ తండ్రి భూపతి రాజగోపాల్ రాజు (90) వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని స్వగృహంలో మంగళవారం రాత్రి మరణించారు. చిత్రసీమ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ కుటుంబంలో విషాదం చోటు చేసుకుందని తెలిసి మెగాస్టార్ చిరంజీవి తన ఆవేదనను వ్యక్తం చేసారు. చిరంజీవి మాట్లాడుతూ ``సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా `వాల్తేర్ వీరయ్య` సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు.
హీరో రవితేజ కి పితృవియోగం
July 16, 2025
0
Tags