80 బంతుల్లో వంద పరుగులు చేసిన జేమీ స్మిత్‌

Telugu Lo Computer
0


టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాట్స్ మెన్ జేమీ స్మిత్‌ 80 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అంతేకాకుండా టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఓ రోజు ఆటలో భోజన విరామానికి ముందు సెషన్‌లోనే వందకు పైగా పరుగులు స్కోరు చేసిన ఇంగ్లండ్‌ తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. జేమీ స్మిత్‌ శతక ఇన్నింగ్స్‌లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. భారత యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో జేమీ స్మిత్‌ ఏకంగా 23 పరుగులు సాధించడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)