టెక్నో నుంచి పోవా 7 5జీ, టెక్నో పోవా 7 ప్రో 5జీ మోడళ్ల విడుదల

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో టెక్నో పోవా 7 5జీ, టెక్నో పోవా 7 ప్రో 5జీ మోడళ్లను విడుదల చేసింది. విభిన్న డిజైన్‌తో బడ్జెట్‌ ధరలో ఈ ఫోన్లను తీసుకొచ్చింది. రెండింట్లోనూ 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. టెక్నో పోవా 7 ప్రో 6.78 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 144 రిఫ్రెష్‌ రేటు, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. టెక్నో పోవా మోడల్‌ 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌టీపీఎస్‌ ఐపీఎస్‌ ప్యానెల్‌తో వస్తోంది. 900 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. ఈ రెండు ఫోన్లలోనూ మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7,300 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HiOS 15తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. టెక్నోపోవా 5జీలో 50 ఎంపీ ప్రధాన కెమెరా ఇచ్చారు. ప్రో మోడల్‌లో 64 ఎంపీ కెమెరా+ 8 ఎంపీ సెకండరీ కెమెరా ఇచ్చారు. రెండు ఫోన్లలోనూ 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంది. ఈ రెండు మోడళ్లలో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. ప్రో మోడల్‌లో 30W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం అదనం. టెక్నో పోవా 7 బేస్‌ మోడల్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.13,999గా పేర్కొంది. బ్యాంక్‌ ఆఫర్లతో కలుపుకొని లిమిటెడ్‌ పీరియడ్‌ మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గ్రీక్‌ బ్లాక్‌, మ్యాజిక్‌ సిల్వర్‌, ఒయాసిస్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. టెక్నో పోవా 7 ప్రో 5జీ కూడా రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.16,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.17,999గా పేర్కొంది. డైన్మిక్‌ గ్రే, గీక్‌ బ్లాక్‌, నియాన్‌ సియాన్‌ రంగుల్లో లభిస్తుంది. జులై 10 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)