ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 500 అదనపు సర్వీస్ టచ్పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఓ కొత్త సర్వీస్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 5,500 టచ్‌పాయింట్ల మైలురాయిని దాటినట్లు కంపెనీ తెలిపింది. ''గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు కనీసం ఒకటి చొప్పున మొత్తం 460 కొత్త సర్వీస్ టచ్పాయింట్లను ఏర్పాటు చేశాం. దీన్ని కొనసాగిస్తూనే ఈ ఏడాది 500 టచ్‌పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వాటిలో ఇప్పటికే 91 సర్వీస్ సెంటర్లను ప్రారంభించాం'' అని మారుతీ సుజుకీ ఎండీ, సీఈవో హిసాషి టకేచి ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త కారును కొనుగోలు చేసే కస్టమర్లు సమీపంలో విశ్వసనీయంగా, సరసమైన ధరలకే సేవలు అందించే సర్వీస్ వర్క్‌షాప్ కోసం చూస్తారని ఆయన పేర్కొన్నారు. ''ఈ అవసరాన్ని తీర్చేందుకు మేం మా డీలర్ పార్ట్‌నర్ల సహకారంతో దేశవ్యాప్తంగా 2,764 నగరాల్లో మొత్తం 5,500 సర్వీస్ టచ్పాయింట్లను ఏర్పాటు చేయగలిగాం'' అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మారుతి సుజుకీ సర్వీస్ నెట్‌వర్క్ సంవత్సరానికి 3 కోట్ల కస్టమర్ వాహనాలకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.7 కోట్ల వాహనాలకు సర్వీస్ చేసినట్లు వెల్లడించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 500 అదనపు సర్వీస్ టచ్పాయింట్లను ఏర్పాటు చేయనున్న మారుతీ సుజుకీ
July 21, 2025
0
Tags