స్థానిక ఎమ్మెల్యేకు 30 లక్షలకు డ్రైవర్ వీడియోలు అమ్ముకున్నాడు : కోటా వినూత

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ కోటా వినూత డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో వినూత దంపతులు షాకింగ్ నిజాలను చెప్పినట్టు సమాచారం. కోటా వినూత బెడ్ రూంలో డ్రైవర్ శ్రీనివాస్ తన ఫోన్ కెమెరా పెట్టినట్టు పోలీసుల విచారణలో చెప్పారు. మార్చిలో ఆ ఫోన్ గుర్తించగా శ్రీనివాస్ ను మందలించినట్టు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తమపై స్పై చేసేందుకు శ్రీనివాస్ ను వాడుకున్నట్టు తెలిపారు. ఇంట్లో రికార్డ్ చేసిన వీడియోలను శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యేకు రూ.30 లక్షలకు అమ్మాడని వినూత దంపతులు పోలీసుల విచారణలో చెప్పారు. ఆ వీడియోలతో తన వర్గీయుల ద్వారా ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్‌కు పాల్పడటంతో విషయం తెలిసి శ్రీనివాస్ ను విధుల నుండి తొలగించినట్టు వెల్లడించారు. శ్రీనివాస్ పై దాడి చేసి తమ ఇంట్లోనే బంధించగా పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)