అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఆర్థిక సాయం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకులాలు, హాస్టళ్లలో ప్రవేశాలు, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, అట్రాసిటీ బాధితులకు పరిహారం, పీఎం ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన, లిడ్‌క్యాప్‌ తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. గురుకులాలు, వసతిగృహాల్లో మిగిలిన సీట్లు భర్తీ చేయాలని, పదో తరగతి విద్యార్థులకు ముందే స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రత అంశాల్లో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)