అమెజాన్ లో ఐఫోన్ 16 పై భారీ డిస్కౌంట్ ఆఫర్ !

Telugu Lo Computer
0


మెజాన్ ఐఫోన్ 16 పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ఐఫోన్ 16 రూ. 79,900 ప్రారంభ ధరకు ప్రారంభించారు. ఇప్పుడు అమెజాన్‌లో రూ. 7,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో అమ్ముడవుతోంది. ఇదే కాకుండా, హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, EMI లావాదేవీలపై రూ. 1,500 వరకు అదనపు తగ్గింపును పొందచ్చు. దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందచ్చు.  దీనిపై ఫోన్ ను  బట్టి రూ. 36,500 అదనపు తగ్గింపు లభిస్తుంది. 6.1-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్‌ను పొందుతారు. దీని రిఫ్రెష్ రేట్ 60Hz, పీక్ బ్రైట్‌నెస్ 2,000 నిట్‌ల వరకు ఉంటుంది. ఇది హెచ్‌డిఆర్ డిస్‌ప్లే, ట్రూ టోన్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ కు సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 48MP ఫ్యూజన్ సెన్సార్ ఉంది, దీనిలో 2x ఆప్టికల్ జూమ్, 12MP మాక్రో లెన్స్ ఉన్నాయి. దీనికి 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)