స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టుకు 10 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించిన ఐసీసీ

Telugu Lo Computer
0


లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై 22 పరుగుల తేడాతో గెలుపొంది, ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ నుంచి ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టుకు 10 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించడమే కాకుండా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లలో 2 పాయింట్ల కోత ఎదురైంది.ఈ మేరకు ఐసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నియమావళిలోని ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఈ శిక్షలు అమలయ్యాయి. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయింది.ఇంగ్లండ్‌ను అధిగమించి శ్రీలంక ఇప్పుడు రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. టేబుల్ టాపర్ ఆస్ట్రేలియా కంటే కొంచెం వెనుకబడి ఉంది. ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయక సిబ్బంది ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇంగ్లండ్ పై 10 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడిందని ఐసీసీ తెలిపింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నేరాన్ని అంగీకరించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ విధించిన ప్రతిపాదిత శిక్షను కూడా అంగీకరించాడు.దీని కారణంగా అధికారిక విచారణ అవసరం లేదు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు పాల్ రీఫెల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, థర్డ్ అంపైర్ అహ్సాన్ రజా, నాలుగో అంపైర్ గ్రాహం లాయిడ్ ఈ అభియోగాలను మోపారు' అని ఐసీసీ పేర్కొంది.ఇదిలాఉంటే, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఆతిథ్య జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ నెల 23న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)