సెప్టెంబర్ 1, 2025 నుంచి యూపీఐ యూజర్లు ఇకపై గోల్డ్ లోన్, బిజినెస్ లోన్, ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను కూడా యూపీఐ ద్వారా ఎక్కడికైనా పంపించవచ్చు. లోన్ అకౌంట్‌ను కూడా యూపీఐకి లింక్ చేసుకునే అవకాశం వచ్చింది. Paytm, PhonePe, Google Pay లాంటి యాప్స్ ద్వారా ఇప్పుడు క్రెడిట్ కార్డుల నుంచి బిజినెస్ లోన్ పేమెంట్ల వరకు అన్నీ చేయగలరు. యూపీఐ పేమెంట్ సిస్టమ్‌ను మరింత సులభంగా, వాడుకలో సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు పేమెంట్స్ పరిధిని పెంచినట్లు ప్రకటించింది. ప్రస్తుతం యూపీఐ వాడేవారు తమ సేవింగ్స్ అకౌంట్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లను మాత్రమే లింక్ చేయగలరు. వాటి ద్వారానే పేమెంట్లు చేయగలరు. కొన్ని రూపే క్రెడిట్ కార్డులు కూడా యూపీఐతో లింక్ అవుతాయి, కానీ అవి చాలా తక్కువ. ఇప్పుడు వచ్చిన కొత్త నిబంధనతో, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ డబ్బులను కూడా కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. యూపీఐ ప్రస్తుత నిబంధనల్లో పర్సన్ టు డబ్బు పంపే సౌకర్యం ఉంది. కానీ, కొత్త నిబంధనలు వచ్చాక, కస్టమర్లు పర్సన్ టు పర్సన్ తో పాటు పర్సన్ టు పర్సన్-మర్చంట్ లావాదేవీలు కూడా చేయగలరు.
సెప్టెంబర్ 1, 2025 నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్
July 22, 2025
0
Tags