వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో ఆపిల్ సంస్థ iOS 26ను విడుదల చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇదే అతిపెద్ద విజువల్ మార్పు కావడం విశేషం. iOS 26లో “లిక్విడ్ గ్లాస్” అనే కొత్త డిజైన్ ను పరిచయం చేసింది. ఈ డిజైన్ అనేది గాజు వంటి పారదర్శకత, లోతైన షేడింగ్, అలాగే మృదువైన అనుభూతిని కలిగించేలా ఉంటుంది. యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ప్రతి మూలకానికి ఓ అద్భుత స్పందన ఉంటుందని కంపెనీ చెబుతోంది. యాప్‌లు, సిస్టమ్ సెట్టింగ్స్, మెనూలన్నీ ఈ డిజైన్‌లో చక్కగా పనిచేయనున్నాయి. ఈ డిజైన్ కేవలం చూడడానికి మాత్రమే పరిమితం కాదు, వినియోగదారుల అనుభూతిని మెరుగుపరిచేందుకు, అలాగే భవిష్యత్ హార్డ్వేర్ కు అనుకూలంగా ఉండేందుకు దీన్ని రూపొందించారని ఆపిల్ సంస్థ పేర్కొంది. Apple Vision Proలో కనిపించే visionOS డిజైన్ శైలికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది.
వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో ఆపిల్ iOS 26 విడుదల
June 10, 2025
0
Tags