బుమ్రా వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన కగిసో రబాడా

Telugu Lo Computer
0


స్ట్రేలియాపై అత్యంత తక్కువ స్ట్రైక్‌రేట్‌తో 50 వికెట్ల మైలు రాయి అందుకున్న తొలి బౌలర్‌గా సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే అతను జస్‌ప్రీత్ బుమ్రా రికార్డ్‌ను అధిగమించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై 64 మంది బౌలర్లు 50ప్లస్ వికెట్లు తీయగా, ఇందులో బుమ్రా, రబాడా మాత్రమే 40 కంటే తక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేశారు. రబడా 38 బంతులకు ఓ వికెట్ తీయగా, బుమ్రా 39.9 బంతులకు ఓ వికెట్ పడగొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రబాడా తొలి ఇన్నింగ్స్‌లో (5/51) ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన బౌలర్లలో కగిసో రబాడా (38), జస్‌ప్రీత్ బుమ్రా(39.9) తర్వాత లోహ్‌మన్(42.9), బిల్లీ బార్నెస్(44.8), డేల్ స్టెయిన్(46.2) ఉన్నారు. అలాగే టెస్ట్‌ క్రికెట్‌లో 150కి పైగా వికెట్లు తీసిన బౌలర్లలో బెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగిన బౌలర్‌గా కూడా రబడా నిలిచాడు. అతను 39.1 బంతులకు ఓ వికెట్ తీసాడు. 100 ప్లస్ వికెట్లు తీసిన బౌలర్లలో రబాడా కంటే ముందు లెహ్‌మన్ బెస్ట్ స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు. 1896లో చివరి మ్యాచ్ ఆడిన అతను 112 వికెట్లు తీసాడు. టెస్ట్‌ల్లో 203 మంది బౌలర్లు 100 ప్లస్ వికెట్లు తీసారు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రబాడా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను అలన్ ఆంథోని డొనాల్డ్‌ను అధిగమించాడు. డొనాల్డ్ 72 టెస్ట్‌ల్లో 330 వికెట్లు తీయగా.. రబాడా 71 టెస్ట్‌ల్లో 333 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డేల్ స్టెయిన్(439), షాన్ పొలాక్(421) ఎన్తిని(390) రబాడా కంటే ముందున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ చరిత్రలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న రెండో బౌలర్‌గా రబాడా నిలిచాడు. గతంలో న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ ఈ ఫీట్ సాధించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)