ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యాసంస్థలలో నియామకాలపై రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎయిడెడ్ విద్యా సంస్థలలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన నియమకాల విషయంలో విద్యాసంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలలలో నియామకాలు చేపట్టాల్సిందిగా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గతంలోనే న్యాయస్థానం జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను విద్యాశాఖ అమలు చేయని కారణంగా పాఠశాల యాజమాన్యాలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజుకు ఆదేశాలు జారీ చేసింది. జులై 11వ తేదీన హైకోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది..
విద్యాశాఖ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ
June 27, 2025
0
Tags