అమెరికా వైద్య సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ ముక్కామల

Telugu Lo Computer
0


మెరికా వైద్య సంఘం అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన డాక్టర్‌ ముక్కామల శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ "బాబీ" ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి అమెరికా వైద్య సంఘం వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు. ముక్కామల మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో అనుభవజ్ఞుడైన ఈఎన్టీ స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఈయన 1972లో జన్మించారు. మెక్‌లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్‌లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది. గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్‌లో 8 సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్‌ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ అమెరికా వైద్య సంఘం ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే అమెరికా వైద్య సంఘం ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది. గతంలో ఏఎంఏ ఫౌండేషన్‌ నుంచి ఎక్సలెన్స్‌ ఇన్‌ మెడిసిన్‌ లీడర్‌షిప్‌ అవార్డును ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్‌ ఆన్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్‌ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

Post a Comment

0Comments

Post a Comment (0)