ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఇంటర్‌ చదువుతున్నఓ విద్యార్థిని దారుణంగా హత్య చేయబడింది. కొంతమంది దుండగులు ఇంటర్‌ విద్యార్థినిని తొలుత తలపై బండరాయితో కొట్టి చంపి, ఆపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఉరవకొండ నియోజవర్గం కూడేర మండలం బ్రహ్మణపల్లి వద్ద మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. తమ కుమార్తె కనిపించడం లేదని ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసలు పట్టించుకోలేదని, చివరకు ఇలా పూర్తిగా కాలిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటర్‌ చదివే ఆ విద్యార్థినిని హత్య చేసిన తర్వాత పెట్రోల్‌ పోసి కాల్చివేసినట్ల తెలుస్తోంది. ఆరు రోజుల క్రితం అదృశ్యమైనప్పటికీ పోలీసుల కాలయాపన చేయడంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు ముందుగానే పట్టించుకని ఉంటే తమ కూతురు బతికేదని తల్లిదండ్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాల్‌లిస్ట్‌ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని ఆ అమ్మాయి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)