ఎలక్ట్రికల్ వెహికల్‌ను ఉపయోగించేవారు చార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి గూగుల్ మ్యాప్స్ ఎంతో త్వరగా చార్జింగ్ స్టేషన్‌ను కనుగొనడానికి కొత్త మార్గాన్ని తీసుకురావడం జరిగింది. దీనిని ఉపయోగించాలంటే, ముందుగా స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయాలి. ఈ అప్లికేషన్ ను ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ కాకుండా, సెర్చ్ బాక్స్ లో ఈవీ చార్జింగ్ స్టేషన్ అని టైప్ చేసి కూడా సెర్చ్ చేయొచ్చు. ఇలా చేయడం వలన గూగుల్ మ్యాప్స్ లో మీరు ఉండేటువంటి ప్రదేశం ఆధారంగా మీ సమీపంలో ఉండే చార్జింగ్ స్టేషన్ ల లిస్టు ను అందిస్తుంది. ఇది మ్యాప్ వ్యూ ను అందించడం వలన ఎంతో త్వరగా చార్జింగ్ స్టేషన్ ను కనుక్కోవచ్చు. ఈవీ చార్జింగ్ స్టేషన్ పేరు, యూజర్ రేటింగ్, రివ్యూ, చార్జింగ్ స్పీడ్, చార్జింగ్ నెట్వర్క్ వంటి వివరాలను అందిస్తుంది. వాటి ప్రకారం డైరెక్షన్స్ ను చూసుకుంటూ చార్జింగ్ స్టేషన్‌ను కనుగొనవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో మీ గమ్యాన్ని నమోదు చేయడం వలన మీరు వెళ్లేటువంటి ప్రదేశంలో ఎక్కడ ఛార్జింగ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయో, ఆటోమేటిక్ గా సూచనలను అందిస్తుంది. ఈ విధంగా ఎంతో త్వరగా చార్జింగ్ స్టేషన్ లను కనుగొనవచ్చు.
ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను సులభంగా గుర్తించే గూగుల్ మ్యాప్
June 12, 2025
0
Tags