బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిర్ణయాలకు చరమగీతం పాడతాం !

Telugu Lo Computer
0


ఢిల్లీ బాస్‌లకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విధేయతను చూపించాలనుకుంటే మీ పేర్లను రాజీవ్‌ లేదా జవహర్‌గా మార్చుకోండి అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చురకలంటిచారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా అకౌంట్‌ 'ఎక్స్‌' వేదికగా ట్వీట్‌ చేశారు. 'అన్నపూర్ణ క్యాంటీన్‌ల పేరు మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తెలివి తక్కువ నిర్ణయాలను రద్దు చేస్తాం. 2028లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిర్ణయాలకు చరమగీతం పాడతాం' అని కేటీఆర్‌ హెచ్చరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)