అమ్మకాలలో దుమ్ములేపుతున్న ఎంజీ విండ్‌సర్

Telugu Lo Computer
0


ఎంజీ మోటార్ విండ్‌సర్ ఈవీ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ కారు కంపెనీ ఈవీ అమ్మకాలను పెంచుతోంది. గత నెలలో ఎంజీ మోటార్ మొత్తం 6,304 కార్లను విక్రయించింది. ఏడాది వారీగా చూస్తే కంపెనీ అమ్మకాల్లో 39.78 శాతం వృద్ధి నమోదైంది. విండ్‌సర్ ఈవీ లాంచ్ అయిన తర్వాత నుంచి కంపెనీ అమ్మకాలు వేగంగా పెరిగాయి. ఈ విజయానికి ప్రధాన కారణం ఎంజీ విండ్‌సర్, దాని పీఆర్ఓ వేరియంట్‌లకు వచ్చిన అద్భుతమైన స్పందన. ఎంజీ మోటార్ ఈ ఎలక్ట్రిక్ కారుకు ఉన్న క్రేజ్ ఎంతలా ఉందంటూ ఇటీవల కంపెనీ ప్రో వేరియంట్‌లను - ఎసెన్స్ ప్రో, ఎక్స్‌క్లూజివ్ ప్రో పేర్లతో మార్కెట్లోకి విడుదల చేసింది. డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే.. ఈ కారు ఒకే ఛార్జింగ్‌తో 449 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. ఇందులో లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, అలాగే వెహికల్-టు-వెహికల్, వెహికల్-టు-లోడ్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎంజీ మోటార్ ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 9 లక్షల 99 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ ధరలో Battery as a Service ప్రోగ్రామ్‌తో పాటు కారు లభిస్తుంది. మీరు BaaS ప్రోగ్రామ్‌తో ఈ కారును కొనుగోలు చేస్తే ప్రతి కిలోమీటర్‌కు రూ. 3.9 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే, మీరు బ్యాటరీని అద్దెకు తీసుకున్నట్లు అన్నమాట.

Post a Comment

0Comments

Post a Comment (0)