నక్సల్స్ రహిత గ్రామంగా కెర్లపెండ

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పోలీసుస్టేషన్‌లో 16 మంది నక్సలైట్లు సోమవారంనాడు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్టు ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. వీరిలో తొమ్మిది మంది చింతలనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే కెర్లపెండ విలేజ్ పంచాయతీకి చెందిన వారు ఉన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలు, స్థానిక గిరిజనులపై అకృత్యాలకు విసిగిపోయి, ప్రభుత్వ పునరావాస విధానంతో జనజీవన స్రవంతిలో కలవాలని లొంగిపోయిన నక్సలైట్లు కోరుకున్నట్టు ఎస్పీ తెలిపారు. పదహారు మంది నక్సలైట్లలో 9 మంది కెర్లపెండ గ్రామానికి చెందిన వారే కావడంతో ఆగ్రామం నక్సల్స్ రహిత గ్రామంగా మారినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్కీమ్ ప్రకారం కోటి రూపాయలతో ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'నియద్ నల్లనార్'  పథకం పట్ల వీరంతా ఆకర్షితులయినట్టు చెబుతున్నారు. లొంగిపోయిన వారిలో రీటా అలియాస్ దోడి సుక్కి (36) అనే మహిళ మావోయిస్ట్ సెంట్రల్ రీజనల్ కమిటీ (సీఆర్ఎస్)లో చురుకుగా వ్యవహరిస్తోంది. రాహుల్ పునెం (18) పీఎల్‌జీఎ సభ్యుడిగా ఉన్నారు. వీరి ఒక్కొక్కరిపై రూ.8 లక్షల రివార్డు ఉంది. మరొకరిపై రూ.3, లక్షలు, ముగ్గురిపై రూ.2 లక్షల చొప్పున రివార్డు ఉంది. కాగా, గత ఏప్రిల్‌లో బడేసట్టి గ్రామాన్ని నక్సల్స్ రహిత గ్రామంగా ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)