శత్రువులను చూసి భయపడుతున్నారనే అభిప్రాయం కలిగితే వారు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు !

Telugu Lo Computer
0


రాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ తన ఎక్స్‌ ఖాతాలో తన దేశస్తులను ఉద్దేశించి ఓ పోస్ట్‌ పెట్టారు. “నా ప్రియమైన దేశం, దేశ ప్రజలకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు శత్రువులను చూసి భయపడుతున్నారనే అభిప్రాయం కలిగితే వారు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మీరు ఇప్పటివరకు చూపించిన ధైర్యం, అదే దృఢ సంకల్పాన్ని కొనసాగించండి. ధైర్యం, బలంతో ఉండండి. మీ వైఖరిపై స్థిరంగా నిలబడండి” అని ఖమేనీ పోస్ట్‌లో రాశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు, ఇజ్రాయెల్ భీరక దాడులు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ లొంగిపోయే పరిస్థితి కనిపించడం లేదని ఖమేనీ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేస్తూ ఇరాన్ ఎవరికీ భయపడదని నిరూపించడానికి ప్రయత్నిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)