తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకర్ పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు నిలిపి ఒక యువతి హల్‌చల్ చేసింది. ఈ విషయాన్ని నాగులపల్లి గ్రామస్తులు గమనించి యువతి నడుపుతున్న కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కారును రైలు పట్టాలపై వేగంగా నడిపి ముందుకు సాగింది. దీంతో గ్రామస్తులు వెంటన రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ మార్గంలో ప్రయాణించే రైలు పైలెట్‌కు సమాచారం అందించారు. దీంతో ఆ మార్గంలో రైళ్లను నిలిపివేశారు. దాంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యువతిపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. నాగులపల్లి సమీపంలో రైలు పట్టాలపై కారు నిలిపిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెతోపాటు కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.
రైలు పట్టాలపై కారు నిలిపి యువతి హల్‌చల్ !
June 26, 2025
0
Tags