మహిళలను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం

Telugu Lo Computer
0


మరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహళా లోకాన్ని కించపరిచిన జగన్‌రెడ్డి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్‌రెడ్డి బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజని సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరించారని గుర్తు చేశారు. ''మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్‌ మాయరోగం నయం చేస్తాం. మహిళలను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. అమరావతిపై విషయం చిమ్మితే అది వెళ్లి తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుంది. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం'' అని లోకేశ్‌ హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)