భారతీరెడ్డి, జగన్‌ క్షమాపణ చెప్పాలి !

Telugu Lo Computer
0


మరావతి మహిళలను కించపరిచేలా సాక్షి ఛానెల్‌లో చర్చలు దారుణమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. అమరావతి మహిళలకు సాక్షి టీవీ ఛైర్‌పర్సన్‌ భారతీరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోమవారం సాయంత్రం ఆమె చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. రాజధానికి వ్యతిరేకంగా సాక్షి ఛానల్‌లో మాట్లాడటం అవమానకరమన్నారు. మహిళలను అవమానించడంపై జగన్‌ క్షమాపణ కోరితే సంతోషిస్తానని తెలిపారు. సాక్షి పత్రిక, ఛానెల్‌ ప్రజా సమస్యల్ని విస్మరించి వైకాపాకు ప్రచారం చేస్తున్నాయని, ప్రజా సమస్యల్ని విస్మరించిన మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కిందంటూ మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)