తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతులు తమ ఫోన్లు చెక్ చేసుకోవాలని సూచనలు చేశారు. జూన్ 17 నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ ప్రారంభం అవుతుందని అన్నారు. మంత్రులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతుల కోసం ఇప్పటివరకు లక్ష కోట్లు ఖర్చుచేసామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బటన్ నొక్కి 70 లక్షల 11 వేల 984 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. వారం రోజుల్లో డబ్బులు అందరికీ జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. " రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు.. ఎవరు చనిపోయినా ప్రతిపక్ష నేతలు సంబరపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ తో అరాచకాలు సృష్టించారు. ఆఖరికి భార్యాభర్తల ఫోన్ లు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి ఉండేది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. సర్పంచ్ లకు బిల్లులు పెండింగ్ పెట్టింది గత ప్రభుత్వమే. నేను సీఎం అయ్యే నాటికే సర్పంచ్ పదవీకాలం ముగిసిపోయింది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టింది. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతునేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని.. అన్నదాతలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల
June 16, 2025
0
Tags