ఫోక్ సింగర్ మంగ్లీ జూన్ 10న తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి ఆమె కుటుంబ సభ్యులు, సినీ సెలెబ్రెటీలతో కలిపి మొత్తం 45 మంది హాజరయ్యారు. ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రిసార్ట్ పై దాడులు చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో గంజాయి, ఫారిన్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీకి హాజరైన 18మందిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 9 మందికి గంజాయికి పాజిటివ్ తేలింది. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఈ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే మంగ్లీ డ్రగ్స్ తీసుకున్నారా? లేదా అనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన మంగ్లీ తెలంగాణ యాస, భాషతో ప్రజలను ఆకట్టుకుంది. అలా తనకున్న టాలెంట్ తో మ్యూజిక్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన మంగ్లీ.. రేలారే.. రేలారే పాటతో ఒక్కసారిగా పాపులరైంది. ఆ తరువాత బతుకమ్మ, బోనాలు నేపథ్యంలో వచ్చిన తెలంగాణ పాటలతో మంచి ఆదరణ పొందింది. అదే క్రేజ్ తో సినిమాల్లో కూడా పాడే అవకాశం దక్కించుకుంది. అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమాలో ' రాములో.. రాములో' పాటతో మంగ్లీ సింగింగ్ కెరీర్ మరింత ఊపందుకుంది. అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమాలో ' రాములో.. రాములో' పాటతో మంగ్లీ సింగింగ్ కెరీర్ మరింత ఊపందుకుంది. అప్పటి నుంచి వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటూ మంగ్లీ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.
మంగ్లీ పుట్టినరోజు పార్టీలో గంజాయి, ఫారెన్ మద్యం స్వాధీనం
June 11, 2025
0
Tags