ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడులను పోలీసు కస్టడీకి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. వీరిద్దరికి జులై 1 నుంచి 3వ తేదీ వరకు కస్టడీ విధించింది. దీంతో పోలీసులు ఇద్దరినీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించనున్నారు. మరోవైపు ఇదే కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మోహిత్ 39వ నిందితుడిగా ఉన్నాడు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడుని ఇటీవల అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు విజయవాడ కోర్టులో హాజరు పర్చగా జులై 1 వరకు రిమాండ్ విధించింది. తాజాగా వారిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ
June 30, 2025
0
Tags