ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం మాజీ ఎంపీ, చల్లపల్లి జమీందార్ తనయుడు యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి కోయంబత్తూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1967లో బందర్ ఎంపీగా ఆయన ఎంపికయ్యారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అభిమానుల సందర్శనార్థం శనివారం చల్లపల్లికి ఆయన భౌతికాయాన్ని తీసుకొస్తారు. ఆయన మృతితో చల్లపల్లిలో విషాదం నెలకొంది.
మాజీ ఎంపీ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కన్నుమూత
June 06, 2025
0
Tags