తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లికి చెందిన బొమ్మగాని తిరుపతి (32) ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం ఉదయం అతను ట్రిమ్మింగ్ చేసుకోవడానికి ట్రిమ్మర్ ను తీసుకుని బాత్రూంలోకి వెళ్లాడు. అక్కడ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కు గురై తిరుపతి అక్కడికక్కడే కింద పడిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని ధర్మారంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. ఇక అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని మరో ప్రైవేటు హాస్పిటల్ కు తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ట్రిమ్మర్ కు ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కు గురై యువకుడి మృతి
June 09, 2025
0
Tags