హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అక్రమంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 6.50 లక్షల విలువైన హాష్ ఆయిల్, గంజాయి, చరాస్, రెండు కత్తులు, మూడు ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. మాసబ్ ట్యాంక్‌కు చెందిన మహమ్మద్ పైజాన్ కీలక సూత్రధారి కాగా, నవ్య అనే మహిళ శ్రీకాకుళం నుంచి హాష్ ఆయిల్‌ను తీసుకొచ్చి విజయ్ కుమార్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి వద్ద హాష్ ఆయిల్ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై గతంలో కూడా ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదైనట్లు డీసీపీ తెలిపారు. ఈ ముఠాకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్ లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠా అరెస్టు
June 18, 2025
0
Tags