ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చెర్లోపల్లిలోని యాదవకాలోని సరోజ (49) అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. ఆమె ఇంటికి పక్కన నదియా అనే మహిళా ఉంది. ఇద్దరు అప్పుడప్పుడు మద్యం సేవించేవారు. ఇద్దరు కలిసి మద్యం తాగిన తరువాత సరోజ తన కుమారుడికి నదియా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని అడిగింది. వేర్వేరు కులాలు కావడంతో ఇద్దరు మధ్య ఘర్షణ జరిగింది. సరోజ మత్తులోకి జారుకున్న తరువాత ఆమె ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టి దిండుతో నొక్కి నదియా హత్య చేసింది. సహజ మరణం కింద భావించి ఆమె కుటుంబ సభ్యులు సరోజా మృతదేహానికి అంత్య క్రియలు చేశారు. సరోజను నదియా చంపుతుండగా ఓ బాలుడు గమనించాడు. 'అన్నా మీ అమ్మ చనిపోలేదు, నదియా అక్క మీ అమ్మకు మద్యం తాగించి, స్పృహ తప్పిన తరువాత ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టి దిండుతో నొక్కి హత్య చేసింది. నేను చాటు ఉండి ఈ దృశ్యాన్ని చూశాను, భయం వేస్తోంది అన్న, ఎవరికీ చెప్పొద్దు' అని ఆమె కుమారుడికి ఓ బాలుడు చెప్పాడు. కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో నదియాను అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించారు. తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి ఆమెను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కుమార్తెను తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయన్నందుకు స్నేహితురాలిని చంపిన మహిళ !
June 18, 2025
0
Tags