హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవినీతితో దోచుకున్న సొమ్ము కోసమే బీఆర్ఎస్‌లో గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ డ్రామాలో మనం సూత్రధారులం, పాత్ర దారులం కావలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు తెలంగాణ రాష్ట్రం నుంచే వెళ్తున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో బీజేపీ పార్టీ పని చేస్తోంది. బీజేపీ తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పార్టీ కాపాడలేదు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలు, brs అవినీతిని ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
దోచుకున్న అవినీతి సొమ్ము కోసమే బీఆర్ఎస్‌లో గొడవలు : కిషన్ రెడ్డి
June 01, 2025
0
Tags