ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. మంత్రి మండలి నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలిపారు. ఏడాదిలో 25 ఈ-కేబినెట్లు నిర్వహించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రిమండలి అభినందనలు తెలిపింది. కూటమి సర్కార్ ఏడాది పాలనలో అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎంకు అభినందనలు మంత్రి మండలి తెలిపింది. ఉద్దానం, కుప్పంలో ఎన్టీఆర్ సుజల కింద నీటి శుద్ది ప్లాంట్లకు వయబులిటీ ఫండ్ ఇవ్వాలని ఉద్దానంకు 5.75 కోట్లు, కుప్పంకు 8.22 కోట్లు వయబిలిటీ ఫండ్ ఫండ్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్దానం, కుప్పంలో ప్రజలకు 2 రూపాయలకే 20 లీటర్లు తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం. వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద వయబిలిటీ ఫండ్. ఫిబ్రవరి 1, 2025 నాటికి యావజ్జీవ శిక్ష పడిన 17మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయం. ఏపీఎస్పీలో 248 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లకుగా పదోన్నతి, వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ మంత్రివర్గం ఆమోదం. ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రి పూట కూడా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో చట్ట సవరణలు. ఇకపై మహిళలు క్వాటర్ లో 144 గంటలు ఓవర్ టైం చేసేందుకు నిబంధనలు మార్చుతూ చట్ట సవరణకు ఆమోదం. విశాఖపట్నంలోని హరిత హోటల్ లో యాత్రీ నివాస్ ను అధునీకరించేందుకు పర్యాటక రంగం చేసిన ప్రతిపాదనకు 13 కోట్ల 50 లక్షల ఆమోదం. రాజధాని అమరావతి లో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం. క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థల ఏర్పాటునకు అమరావతిలో 50 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వాంటం కంప్యూటింగ్, ఎఐలో రాబోయే 5-10ఏళ్లలో ఏపీ నెంబర్ 1 స్థానానికి చేరడమే లక్ష్యం. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహించాలని నిర్ణయం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రి వర్గం ఆమోదం. MSME పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన బడ్జెట్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతిలో క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థలకు 50 ఎకరాల కేటాయించాలని మంత్రి మండలి నిర్ణయం
June 04, 2025
0
Tags