3 బీహెచ్‌కే మూవీ గురించి హీరో సిద్దార్థ మాట్లాడుతూ ఇది నా 40వ సినిమా. ఇందులో నా తల్లిదండ్రులు కూడా నటించారు. ఈ మూవీ విషయంలో నా పేరెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించా. ఇది 40వ సినిమా అని నా తండ్రి సూర్య నారాయణన్ కు చెప్పాను. ఆయన చాలా గర్వపడ్డారు. ఆయన ముఖంలో చెప్పలేనంత ఆనందం, సంతోషం కనిపించాయి. అంతకంటే నాకు ఇంకేం కావాలి అనిపించింది.'' అంటూ కంటతడి పెట్టుకున్నారు సిద్దార్థ్. ఈ సినిమా కోసం నా పేరెంట్స్ వాళ్ల డబ్బును ఖర్చు పెట్టారు. మూవీలో నటించిన వారంతా అద్భుతంగా చేశారు. ప్రస్తుతం నా సిచ్యువేషన్ బాగా లేదు. అందుకే అద్దె ఇంట్లో ఉంటున్నా. ఈ సినిమాను చూస్తే నా కుటుంబ పరిస్థితులు నాకు గుర్తుకు వస్తున్నాయి. ఈ మూవీ జులై 4న రిలీజ్ కాబోతోంది. అందరికీ నచ్చుతుంది’ అంటూ సిద్దార్థ్ చెప్పాడు.
3 బీహెచ్‌కే మూవీ ట్రైలర్ రిలీజ్ లో కంట తడి పెట్టుకున్నహీరో సిద్ధార్థ
June 27, 2025
0
Tags