వొడాఫోన్ ఐడియా 5జీ సేవలను మరిన్ని నగరాలకు విస్తరించింది. ఇటీవలే ముంబయి, ఢిల్లీ - ఎన్‌సీఆర్, బెంగళూరు, చండీగడ్, పట్నా నగరాల్లో 5జీ సేవలకు శ్రీకారం చుట్టిన ఆ కంపెనీ తాజాగా మరో మరో 23 ప్రధాన పట్టణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో విశాఖపట్నంతో పాటు జైపూర్, కోల్‌కతా, లఖ్‌నవూ వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి. అహ్మదాబాద్, ఆగ్రా, ఔరంగాబాద్, కొయ్‌కోడ్, కొచ్చిన్, దేహ్రాదూన్, ఇందౌర్, జైపూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, మధురై, మళప్పురం, మేరఠ్, నాగ్‌పుర్, నాశిక్, పుణె, రాజ్‌కోట్, సోనీపత్, సూరత్, సిలిగురి, త్రివేండ్రం, వడోదర, వైజాగ్ పట్టణాల్లో 5జీ సేవల విస్తరణ కొనసాగుతోందని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఆయా పట్టణాల్లో నెట్‌వర్క్ లైవ్‌లోకి రాగానే 5జీ డివైజ్ వాడుతున్న వారు వేగవంతమైన డేటా సేవలను ఆనందించొచ్చని తెలిపింది. రూ.299 కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జి చేసిన వారు అపరిమిత 5జీ డేటా పొందొచ్చని కంపెనీ పేర్కొంది.
విశాఖపట్నం సహా మరో 23 నగరాలకు వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు
June 30, 2025
0
Tags