ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తాం

Telugu Lo Computer
0

తెలంగాణాలో ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పాలకుర్తిలో పర్యటిస్తున్న ఆయన భూసమస్యలపై మాట్లాడారు. భూ భారతితో రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. జూన్‌ 3 నుంచి ఈ నెల 20 వరకు అధికారులే ప్రజల వద్దకు వస్తారు. రెవెన్యూ వ్యవస్థ గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తుంది. అన్ని మండలాల్లో శిక్షణ ఇచ్చిన సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తాం. ఇళ్లు ఇచ్చే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)