క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు : కోచ్‌ వినాయక ప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారిణులను లైంగిక వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ వినాయక ప్రసాద్‌ను ఏలూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొద్దిరోజుల క్రితం కోచ్ వినాయక ప్రసాద్ పై వెయిలిఫ్టింగ్ క్రీడాకారిణులు ఫిర్యాదు చేశారు. బాలికల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన బెంగుళూరు నుంచి వచ్చిన శాయ్‌ సభ్యులు లైంగిక వేధింపులు నిజమేనని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు వినాయక ప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. కోర్టు వినాయక ప్రసాద్‌ కు 14 రోజుల రిమాండ్ విధించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)