ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కేసులో పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న విశాఖలో అరెస్టు చేసిన తుళ్లూరు పోలీసులు అతడిని గురువారం మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో అతడిని గుంటూరు జైలుకు తరలించారు. ఇదే కేసులో ఇప్పటికే సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
కృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ
June 12, 2025
0
Tags