నవంబర్‌ వరకు సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం అతన్ని సస్పెండ్‌ చేసింది. సంజయ్‌పై వచ్చిన అభియోగాల విచారణపై ఏర్పాటైన కమిటీ సిఫార్సులతో 2024 డిసెంబరు 3న సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు వెలువరించింది. ఆ తర్వాత సస్పెన్షన్‌ను 2025 మే 31 వరకు పొడిగించింది. ఆ సస్పెన్షన్‌ను ఈ ఏడాది నవంబర్‌ వరకు మరోసారి పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)