ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్ ఘఢ్‌లోని రాయ్‌పూర్‌కు పైప్‌లైన్ ఏర్పాటుకు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రూ.2,212 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం) మీదుగా ఈ పైప్‌లైన్ రాయ్‌పూర్‌కు వెళ్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 165 కిలోమీటర్లు. ఈ మార్గంలో పంపింగ్, పిగ్గింగ్ స్టేషన్లు, సెక్షన్ల వారీగా వాల్వ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పంపింగ్ స్టేషన్‌కు ఆరు నుంచి ఎనిమిది ఎకరాల భూమి అవసరం. అలాగే వాల్వ్ స్టేషన్‌లకు అర ఎకరా చొప్పున కావాలి. ఈ నాలుగు జిల్లాల్లో అవసరమైన భూములను డీ పట్టాలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించగా జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, ఆర్‌డీఓ, హెచ్‌పీసీఎల్ ప్రాజెక్ట్ మేనేజర్, డీజీఎం, జీఎం స్థాయి అధికారులతో ఐదుగురు సభ్యుల కమిటీలను ఏర్పాటుచేయాలని సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరు అక్కడి ధరల ఆధారంగా భూమికి పరిహారం ఇస్తారు. పైపులైన్ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్
May 06, 2025
0
Tags