తిరుమలలో పెరిగిన భక్తుల తాకిడి

Telugu Lo Computer
0


ఏడాది మే నెలలో మొదటి 15 రోజులు భక్తుల తాకిడి పెద్దగా లేనప్పటికీ అటు తరువాత నుంచి భక్తులు తాకిడి పెరగడంతో టీడీడీ అప్రమత్తమైంది. ఈవో శ్యామలరావు ఆదేశాలతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిరంతరాయంగా క్యూ లైను మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. ప్రధానంగా రాత్రి 9 గంటల నుంచి ఏకాంత సేవ నిర్వహించే సమయం వరకు కూడా టోకెన్ లేని భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తుండడంతో ఆ సమయంలో క్యూ లైన్ మేనేజ్మెంట్ పై అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అన్ని విభాగాల వారిని సమన్వయం చేస్తూ గంటకు 4900 నుంచి 5 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం భాగ్యం కల్పించడంతో రోజుకి అదనంగా 10 వేల మంది వరకు భక్తులు స్వామివారి దర్శనభాగ్యం లభించింది. ఎన్నడు లేని విధంగా గురువారం 72 వేల మంది, శుక్రవారం 74 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, శని, ఆదివారాల్లో 90 వేల మంది, సోమవారం 83 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో వైపు స్వామివారి రోజు వారి హుండీ ఆదాయం కూడా చాలా రోజులు తరువాత 5 కోట్ల మార్క్ ని దాటింది. దీనితో ఐదు రోజులు వ్యవధిలో స్వామివారికి హుండీ ద్వారా 19 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మరో వైపు శ్రీవారికి ఐదు రోజులు వ్యవధిలో 2 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం రోజు అయితే ఏకంగా 46 వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అన్నప్రసాదం సముదాయంతో పాటు క్యూ లైనులో వేచివున్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం కల్పించింది. ఇలా ఐదు రోజులో 12 లక్షల భోజనాలు భక్తులకు టీటీడీ సరఫరా చేసింది. మొత్తంగా వికేండ్ లో శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా సేవలందించడంతో పాటు అత్యధిక మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)